ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఫైర్ అయ్యింది. చంద్రన్న విలేజ్ మాల్స్ ప్రజలకు ఎలా ధరలు తగ్గిస్తాయో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పాలని రోజా ప్రశ్నించారు. ప్రస్తుతం రిలయన్స్ మాల్స్ లోకాని, హెరిటేజ్ రిటైల్స్ షాపులలోకాని విపరీతమైన రేట్లు ఉన్నాయని,కాని ఐదు శాత తక్కువకు రిలయన్స్ మాల్స్ , హెరిటేజ్ మాల్స్ లో ఇచ్చినా, రేషన్ షాపులలోకి కన్నా వంద నుంచి రెండువేందల రేట్లు ధరలు అదికంగా ఉన్నాయని ఆమె సోదాహరణంగా వివరించారు.
పంచదార కిలో బయట ఎంత ధర ఉంది, మాల్స్‌లో ఎంత ధర ఉందో చూస్తే అర్ధమవుతుందని ఆమె అన్నారు. రేషన్ షాపులను నిర్వీర్యం చేస్తూ, వంల కోట్ల రూపాయల మేర దోపిడీ చేయడానికే చంద్రన్న మాల్స్ పేరుతో రిలయన్స్ , హెరిటేజ్ కంపెనీలకు అప్పగిస్తున్నారని ఆమె విమర్శించారు.చంద్రన్న సంక్రాంతి కానుకలో నెయ్యి ఇస్తామని చెప్పి, హెరిటేజ్ సరుకు అంతటిని అమ్ముకున్నారని, అలాగే మజ్జిగ ఇస్తామని చెప్పి హెరిటేజ్ మజ్జిగ అమ్ముకున్నారని రోజా తెలిపారు. వచ్చే కాలంలో మళ్లీ ముఖ్యమంత్రి అవుతానో, లేనో అన్న అనుమానంతో అన్నిటికి తన పేర్లే పెట్టుకున్నారని రోజా ఎద్దేవ చేశారు. కార్పొరేట్ దోపిడీకి పుల్ స్టాప పెట్టాలని, రేషన్ ఫాపులలోనే అన్ని సరుకులు పంపిణీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.