టాలీవుడ్ సినీ క్రిటిక్ మహేష్ కత్తి మరో సారి జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌పై ఫైరయ్యారు. ఇటీవల జరిగిన ఓ లైవ్ షోలో పవన్ కల్యాణ్‌ను విమర్శించే స్థాయి నీది కాదంటూ పవన్ కల్యాణ్ అభిమాని మహేష్‌కత్తిపై లైవ్ షోలోనే బండబూతులు తిట్టాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన కత్తి మహేష్ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌కన్నా తాను నాలుగు ఆకులు ఎక్కువే చదువుకున్నానని సమాధానం ఇచ్చారు. పవన్ కల్యాణ్ కేవలం 12 తరగతి వరకు చదివి, అందులోనూ పవన్ ఫెయిల్ అయ్యాడని గుర్తు చేశారు. కానీ నేను సెంట్రల్ యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశానన్నారు. అసలు చిరంజీవి లేకుంటే.. పవన్ కల్యాణ్ అనే అతను లేడన్నారు. కానీ నేను క్రిటిక్‌ని, నేను చదువుకొని వచ్చాను. ఫిల్మ్ ఎడ్యుకేషన్ చేసి వచ్చాను. పవన్ కల్యాణ్‌కు ఉండేది కుగజ్జీ.. మీ జనసేనకు ఉండేది కులగజ్జీ అందుకే నా స్థాయి గురించి మాట్లాడుతున్నారు అంటూ పవన్ ఫ్యాన్స్‌పై కత్తి మహేష్ ఫైరయ్యాడు.
