రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కే తారకరామారావుకు విశేష గౌరవం దక్కింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఏక్స్ కాన్- 2017 సదస్సులో భాగంగా నిర్వహిచిన nextgen ఇన్ప్రాస్టక్చర్ అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సును కర్ణాటక భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఆర్వీ దేశ్ పాండేతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మౌలిక వసతుల కల్పన ద్వారా మాత్రమే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ విషయాన్ని గుర్తించిన తమ ముఖ్యమంత్రి సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, మిషన్ భగీరథ వంటి ప్రాజెక్టుల ద్వారా ప్రజలకు అభివృద్ది ఫలాలు అందించేందుకు ముందుకు పోతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన మౌలిక వసతుల ప్రాజెక్టుల నేపథ్యంలో రాష్ర్టంలోనే మౌలిక వసతుల యంత్ర పరికరాల తయారీ యూనిట్లు నెలకొల్పేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
Spoke at EXCON 2017, gathering of all equipment manufacturers on ‘Next Gen Infrastructure’ in Bengaluru
Combination of Innovation & Infrastructure will lead to inclusive growth of India was the thought I shared pic.twitter.com/UXnH5JX6oR
— KTR (@KTRTRS) December 13, 2017
ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారానే సమ్మిళిత అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. రానున్న ఎక్స్‌కాన్ ఏక్సోఫోను హైదరాబాదు నగరంలో ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి నిర్వాహకులను కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే విప్లవాత్మకమైన పరిపాలనా సంస్కరణలు, పారిశ్రామిక విధానం ద్వారా అనేక పెట్టుబడులను తెలంగాణ రాష్ట్రం ఆకర్షిస్తుందని మంత్రి తెలిపారు. ఈరోజు ఉదయం మంత్రి మౌళిక వసతుల యంత్ర పరికరాల తయారీదారులతో సమావేశమయ్యారు. మొత్తం భారతదేశానికి రవాణా పరంగా తెలంగాణ మద్యలో ఉంటుందని, దేశ నలుమూలలకు ఇక్కడి నుంచి సరుకుల రవాణా సులభంగా ఉంటుందని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులు నేపథ్యంలో ఇక్కడే అయా యంత్ర పరికరాల తయారీ చేపట్టడం కలిసి వస్తుందని మంత్రి కేటీఆర్ వారికి వివరించారు. ఇప్పటికే మౌళిక వసతుల యంత్ర పరికరాల కొనుగోలులో తెలంగాణ ప్రముఖ స్ధానంలో ఉన్నదని…అలాంటి చోటనే ఈ యంత్రాల తయారీకి చేపట్టాలని కోరారు.