రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ బుధవారం బిజీబిజీగా గడిపారు. ఉదయం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లిన ఎక్సాన్-2017 ఎక్స్‌పోకు హాజరయ్యారు. అనంతరం బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్లిన మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా ప్రఖ్యాత అంతర్జాతీయ సంస్థ జనరల్ ఎలక్ట్రికల్స్ చైర్మన్ జాన్ ఫ్లానరీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్, విద్యుత్, ఏరోస్పేస్, మెడ్‌టెక్ వంటి అంశాలపై చర్చించారు. గురువారం కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ సమావేశం అనంతరం హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యారు.
కాగా, ఎక్సాన్-2017 సదస్సులో భాగంగా నెక్ట్స్‌జెన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనే అంశంపై కాన్ఫరెన్స్‌ను కర్ణాటక మంత్రి ఆర్వీ దేశ్‌పాండేతో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మౌలిక సదుపాయాల రంగంలో రాష్ట్రంలో గల అవకాశాలు, పారిశ్రామిక ప్రగతికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే విప్లవాత్మకమైన పరిపాలనా సంస్కరణలు పారిశ్రామిక విధానం ద్వారా అనేక పెట్టుబడులను ఆకర్షిస్తుందని తెలిపారు. దేశంలో రవాణా పరంగా తెలంగాణ మధ్యలో ఉంటుందన్నారు. దేశం నలుమూలలకు ఇక్కడి నుంచి సరుకుల రవాణా సులభంగా చేయొచ్చన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భారీ మౌలిక వసతుల ప్రాజెక్టుల నేపథ్యంలో ఇక్కడే ఆయా యంత్ర పరికరాల తయారీ చేపట్టడం నిర్వాహకులకు కలిసి వస్తుందన్నారు.
In Delhi, the day ends with an exciting meeting with the Chairman & CEO of General Electric @JohnFlannery_GE
Healthcare, Lifesciences, Energy, Aerospace & Medtech discussed. Now back to Hyderabad
One
exciting announcement tomorrow pic.twitter.com/EZ3bLjCNbf
— KTR (@KTRTRS) December 13, 2017