బాహుబలి చిత్రంతో జాతీయ స్థాయిలో రికార్డు సాధించిన స్టయిలిష్ హీరో ప్రభాస్ పెళ్లి ఎప్పుడెప్పుడా.. అని అంతా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ పెళ్లి పై అనేక వార్తలు హాల్‌చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌గా ఉన్న ప్రభాస్ వివాహం పై రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ వివాహాం జాతకాలన్నీ పరిశీలించిన తర్వాతే కుదురుస్తామని అన్నారు.
తాజాగా ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ప్రభాస్ తన పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే, జాతకాలు పోల్చి చూడటం ప్రారంభిస్తామని, ప్రభాస్ ఎప్పుడు తన నోటి నుంచి ఎస్ చెబుతాడా అని ఎదురు చూస్తున్నామని అన్నారు. తన జన్మ నక్షత్రాన్ని బట్టి సంపన్నుడు అవుతావని మాత్రమే చెప్పగలరని, ఎంత సంపాదిస్తారన్న విషయాన్ని జ్యోతిష్యం చెప్పదని కృష్ణంరాజు అన్నారు. అంతేకాకుండా ప్రభాస్‌కి దైవ నిర్ణయానికి స్వయం కృషి కూడా తోడు కావాల్సి వుంటుందని తెలిపారు. ఇక బాహుబలి షూటింగ్ జరిగినన్ని రోజూలూ ప్రభాస్ ఎంతో తపన, శ్రమ, అంకితభావాన్ని చూపించాడని, అందుకే దేవుడు కూడా దీవించాడని అన్నారు.