వైసీపీ అధినేత జగన్ చేస్తున్న పాదయాత్రలో తన మాటలకు పదును పెట్టారు. జగన్ మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఒక నటుడిని ముందుంచి ఆయన చేత అబద్ధాలు చెప్పించి బాబు ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు. అసలేమాత్రం అమలు చేయలేని హామీలన్నీ ప్రజలకు గుప్పించి ఎలాగోలా పీఠాన్ని ఎక్కాడు. నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలు మాట్లాడటం చంద్రబాబుకు అలవాటు. ఈసారి ఆయన అబద్ధాల మాటలను ప్రజలకు చెప్పే నటుడెవరో.. ఈసారి ఎవరు అమ్ముడుపోతారో చూడాలని జగన్.. చంద్రబాబు పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న జగన్ చంద్రబాబు.. అండ్ ప్యాకేజ్ బాబుల గాలి తీస్తూ చాలా సింపుల్‌గా జనాలకి అర్ధమయ్యేలా విమర్శలు చేశారు. రెండు రోజుల క్రితం బాబును గెలిపిస్తే ఇంటింటికి కేజీ బంగారం.. ఇంటికో కారు ఇస్తామని మరోసారి దొంగ హామీలతో ఎల్లో గ్యాంగ్ వస్తారన్న జగన్.. ఈసారి ఎన్నికల్లో మాత్రం బాబుకు అమ్ముడుపోయి.. ఎన్నికల్లో ప్రచారం చేసే నటుడు ఎవరోనని ప్రజలనే ప్రశ్నించారు జగన్. గత ఎన్నికల్లో ఒక నటుడు బాగా లాభం పొందాడు.. బాగా లాక్కున్నట్లు ఉన్నాడు. అందుకే బాబు చెప్పిన అబద్ధాలన్నీ అలాగే చెప్పాడంటూ పవన్ పై విమర్శలు చేశారు జగన్. గత కొన్నిరోజులుగా వైసీపీని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్నా పట్టించుకోని జగన్.. తాజాగా పవన్‌కు కూడా తన పదునైన పంచుల రుచి చూపించారు జగన్.. మరి జగన్ వేసిన పంచ్‌లపై జనసేన కౌంటర్ ఎటాక్ ఎలా ఉంటుందో అని సర్వత్రా చర్చించుకుంటున్నారు.