బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ అనుసంధానంపై కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.బ్యాంక్ ఖాతాలతో ఆధార్ లింక్ కు డిసెంబర్ 31 డెడ్‌లైన్‌ను ప్రభుత్వం పొడిగించింది. అయితే కొత్త తేదీని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. ఈ మేరకు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్‌కు సవరణలు చేసింది. మరోవైపు పాన్ నెంబర్ తో ఆధార్ అనుసంధానానికి 2018 మార్చి 31 వరకు గడువు ఉండగా… మొబైల్ నెంబర్లకు ఫిబ్రవరి 6వ తేదీ వరకు గడువు ఉంది.
