ఆయన ఐదు సార్లు ఏకంగా ఎంపీగా గెలిచారు .అంతేనా ఏకంగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు .అంతటి రాజకీయ అనుభవం ఉన్న నేత ఏకంగా యాబై ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అంటే నమ్ముతారా ..కానీ ఇదే నిజం .బాగున్ సంబ్రాయ్ 1967నుండి 5 సార్లు ఎంపీగా ,4 సార్లు ఎమ్మెల్యేగా ఝార్ఖండ్ లో గెలిచారు .అతనికి సరిగ్గా ఎనబై మూడు సవంత్సరాలు .అయితే తన ఎనబై మూడు సవంత్సరాల వయస్సులో ఏకంగా యాబై ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకున్నారు .
ఇలా ఎందుకు చేసుకున్నారు అని అడిగితె ఆయన సమాధానం ఇస్తూ గతంలో తానూ నివసించే ప్రాంతంలో ఆదివాసీ జాతరలు అధికంగా జరుగుతుండేవి .అయితే ఈ జాతరకు వచ్చే వారు ఎక్కువగా వ్యాపారులు కావడంతో ఆదివాసీ స్త్రీలను లైంగికంగా వేధించేవారు .అంతటితో ఆగకుండా వాళ్ళు ఏకంగా వారిపై అత్యాచారాలకు పాల్పడేవాళ్ళు ..
ఇలా చేయడంతో కొంతమంది తీవ్ర అనారోగ్యాల భారిన పడేవారు .దీంతో వారికీ చేయుట నివ్వడంకోసం ఇలా వివాహాలు చేసుకునేవాడ్ని .అయితే నేను వివాహం చేసుకొని వాళ్లతో సంసారం మాత్రం చేసేవాడ్ని కాదు .ఎందుకంటే వాళ్ళకు అండగా ఉండాలని ఇలా చేశాను తప్ప .శరీర వాంఛ తీర్చుకోవడం కోసం కాదు .వాళ్ళకు నచ్చినవాళ్లు ,సరైన వాళ్ళు తగిలినప్పుడు వాళ్ళను పెళ్లి చేసుకొని వెళ్ళేవారు .అలా యాబై ఎనిమిది పెళ్ళిళ్ళు చేసుకున్నాను కానీ దానివెనక పెద్ద రహస్యం ఏమి లేదు అని ఆయన చెపుకుంటూ వచ్చారు ..