అఖిల ప్రియ.. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి అధికారం కోసం ..పదవుల కోసం..టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చూపించన తాయిలాలకు ఆశపడి టీడీపీ పార్టీలో చేరారు అని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్న ప్రధాన ఆరోపణ .అయితే ఏపీలో ఇటివల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో భాగంగా వైసీపీ తరపున గెలిచి టీడీపీలో చేరిన కొంతమంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులిచ్చారు చంద్రబాబు.
అందులో భాగంగా అఖిల ప్రియకు పర్యాటక శాఖ మంత్రి పదవిని కట్టబెట్టారు .నిన్న మంగళవారం మంత్రి వర్గ భేటీ జరిగింది .ఈ భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి భూమా అఖిలప్రియపై అసహనం వ్యక్తం చేశారు అని బాబు ఆస్థాన మీడియా వార్తలను ప్రసారం చేసింది .భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి అంటే ఏసీ కార్లలో తిరగడం కాదు .ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారం కోసం ప్రయత్నాలు చేయాలి .
అధికారులను ఎప్పటికప్పుడు పరుగులు పెట్టిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేయించాలి .అందులో అందర్నీ భాగస్వాములు చేయించాలి .ఇలా అయితే మీ స్థానంలో ఇంకొకరు ఉంటారు అని మంత్రి అఖిల ప్రియపై బాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు .అయితే ఇటివల కృష్ణా నదిలో బోటు ప్రమాదం వలన ఇరవై రెండు మంది చనిపోవడం వలన టీడీపీ సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడమే బాబు ఆగ్రహానికి ప్రధాన కారణం అని మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు .