ఏపీలో బాబుగారి ఆపరేషన్ ఆకర్ష్ వలలో పడి టీడీపీలో చేరిన వైకాప ఎమ్మెల్యేలకు ప్రజలు తగిన బుద్ది చెబుతున్నారు. అధికార పార్టీ ప్రవేశ పెట్టిన ఇంటీంటీకి టీడీపీ కార్యక్రమంలో భాగంగా గ్రామసభలో మాట్లడుతున్న ఫిరాయింపు ఎమ్మెల్యేపై కింతమంది యువకులు కోడిగుడ్లతో విసిరిన ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజక వర్గంలో అదివారం రాత్రి చోటు చేసుకుంది.స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి వైసీపీ నుండి గెలిచి టీడీపీలో చేరారు. ఆయన ఇంటీంటికీ టీడీపీ కార్యక్రమంలో భాగంగా అదివారం రాత్రి అర్థవీడు మండలం వెలగలపాయ గ్రామంలో జరిగిన గ్రామ సభలో పాల్గొన్నారు.ఆ సందర్భంగా ఆయన మాట్లడుతుండగా ఎమ్మెల్యేపై సబలో నుంచి ఎవరో నాలుగైదు కోడి గుడ్లు విసిరేశారు. దీంతో అక్కడ ఒక్కసారిగా అలజడి రేగింది. పక్కనే ఉన్న ఎమ్మెల్యే అనుచరులు కొంతమంది యువకులపై చేయి చేసుకోవడంతో గ్రామస్తుల వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడిగుడ్లు విసిరేశారనే అనుమానంతో సర్పంచి బంధువులు నలుగురు యువకులపై దాడికి దిగారు. నిందితులపై కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే ఆదేశించినట్లు సమాచరం. దీనిపై పోలీసులను వివరణ కోరగా ఎవరో ఆకాతాయిలు మద్యం మత్తులో విసురుకున్నారని , వారు టీడీపీ కార్యకర్తల లేక ఇతరుల అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని..ఇంక ఎవరినీ అదుపులోకి తీసుకులేదని చేప్పారు.
