ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ,నంద్యాల పార్లమెంటు నియోజక వర్గ వైసీపీ అధ్యక్షుడు శిల్పా చక్రపాణి రెడ్డి జనసేన అధినేత ,పవన్ కళ్యాణ్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు .ఇటివల ఏపీలో పర్యటించిన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై విమర్శల వర్షం కురిపించారు .ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ తన తండ్రి ముఖ్యమంత్రి అయితే ఆయన తనయుడు ముఖ్యమంత్రి కావాలి అని ఎక్కడైనా ఉందా ..ఇది సమాజానికి మంచిది కాదు .
జగన్ మంచోడు కాదు అని గత సార్వత్రిక ఎన్నికల్లో మద్దతు ఇవ్వలేదు అని ఆయన అన్నారు .ఈ వ్యాఖ్యలపై చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ “ఇంటర్ ఫెయిలై దేనికి పనికిరాకుండా ఇంట్లో ఖాళీగా ఉంటున్న పవన్ ను తన అన్న చిరంజీవి సినిమాల్లోకి తీసుకొచ్చారు .ఆయనను చూసే అభిమానులు పవన్ కు అభిమానులుగా మారిపోయారు .అంతే తన అన్న పార్టీ పెట్టినప్పుడు యువరాజ్యం అధినేతగా పవన్ రాష్ట్ర అంతటా తిరిగి ప్రచారం చేశారు .అంటే తన అన్న తీసుకొస్తే సినిమాల్లోకి రావచ్చు ..
అన్న పార్టీ పెడితే ఆ పార్టీ విభాగంలో ఆయన అధ్యక్షుడిగా ఉండొచ్చు .కానీ సొంతంగా పార్టీ పెట్టి ఒక్కసారి ఎంపీగా దేశంలోనే ఎక్కడ లేని ఎన్నడు లేని ఏ విధంగా బంపర్ మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టించడమే కాకుండా ,ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా తన పార్టీ తరపున అరవై ఐదు మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న జగన్ పార్టీ పెట్టి ముఖ్యమంత్రి స్థాయి లేదా ..ముందు పవన్ నీ స్థాయి ఏమిటో నిరూపించుకో ..ప్రజాక్షేత్రంలో గెలవడం చేతకాని నువ్వు బాబుకు అమ్ముడు పోయి రోజుకు ఇంతా అని ప్యాకేజీ తీసుకునే నువ్వా జగన్ ను విమర్శించేది అని దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు ..