ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పాయాత్ర అనంతపురం జిల్లాలో అశేష జనవాహిని మధ్య దిగ్విజయంగా కొనసాగుతోంది. అడుగడుగునా వైఎస్ జగన్‌కు జనం విన్నపాలు వినిపిస్తుంటే.. సావధానంగా వింటూ.. భరోసానిస్తూ జననేత ముందుకు సాగుతున్నారు. వైఎస్ జగన్ 33వ రోజున రాప్తాడు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం 8 గంటలకు అనంతపురం రూరల్ మండలం చిన్నంపల్లి క్రాస్ రోడ్ నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. కూరుకుంట బీసీ కాలనీ, సజ్జల కాల్వ క్రాస్ రోడ్డు మీదుగా కూరుకుంట ఎస్సీ కాలనీకి చేరుకుని అక్కడ పార్టీ జెండా ఆవిష్కరిస్తారు.
అనంతరం వైఎస్సార్ కాలనీ, అక్కంపల్లి క్రాస్ రోడ్డు మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. 12 గంటలకు లంచ్ బ్రేక్ తీసుకుంటారు. అనంతరం 3 గంటలకు తిరిగి పాదయాత్ర చేపడతారు. నందమూరి నగర్ మీదుగా పాదయాత్ర కొనసాగి సాయంత్రం 4 గంటల సమయంలో పాపంపేట వద్ద బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడతారు.