టాలీవుడ్ హాస్య నటుడు విజయ్ సాయి ఆత్మహత్య సంఘటన సినిమా ఇండస్ట్రీల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే…అయితే విజయ్ తాను చనిపోయే కంటే ముందు సెల్ఫీ వీడియోలో సంచలనాత్మక విషయాలు వెల్లడించారు. తన చావుకు భార్య వనితనే కారణమని స్పష్టం చేశారు. వాల్ పోస్టర్ సినిమా షూటింగ్‌లో వనిత తనకు పరిచయం అయిందన్నారు. పెళ్లి అయిన తర్వాత వనిత నిజస్వరూపం తెలిసిందన్నారు. వ్యాపార అవసరాల నిమిత్తం.. తన భార్యను కొంతమంది పారిశ్రామికవేత్తలు ఉపయోగించుకున్నారని వెల్లడించారు. ఆ విషయం తెలిసినప్పటి నుంచి తనకు, వనితకు అనేకసార్లు గొడవలు అయ్యాయని చెప్పారు. చివరకు తన కూతురు కుందనను కూడా చూడనివ్వలేదని పేర్కొన్నారు.
వనితకు గతంలోనే అమ్మిరెడ్డి అనే వ్యక్తితో పెళ్లి అయిందన్నారు. తన భార్య, ఆమె తల్లి వ్యభిచారం చేసేవారని వారి సొంతూరుకు వెళ్తే తెలిసిందని విజయ్ వీడియోలో పేర్కొన్నారు. ఇలాంటి వారి వల్ల సమాజం చాలా ఇబ్బంది పడుతుంది. వనిత లాంటి వారిని వదలొద్దు. డాడీ.. ఎవ్వరిని విడిచిపెట్టొద్దు.. నిద్ర పట్టడం లేదు. అందరికీ శిక్ష పడేలా చూడు.. లవ్ యూ డాడీ.. కుందన అలాంటి వాతావరణంలో పెరగడం ఇష్టం లేదు.. తీసుకొని రండి డాడీ.. ప్లీజ్ డాడీ.. అంటూ విజయ్ సెల్ఫీ వీడియోలో స్పష్టం చేశారు.