టాలీవుడ్ హాస్య నటుడు విజయ్ సాయి ఆత్మహత్య సంఘటన సినిమా ఇండస్ట్రీల్లో విషాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సంఘటన వెనక కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. కేవలం అవకాశాలు లేక పోవడం కారణం కాదని, కుటుంబ కలహాలు అతడిని ఆత్మహత్య చేసుకునేలా చేశాయని తెలుస్తోంది.తమ కుమారుడి ఆత్మహత్యకు అతడి మాజీ భార్య వనితారెడ్డే కారణం అని హాస్యనటుడు విజయ్ సాయి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వనితతో గొడవల కారణంగానే విజయ్ ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. అయితే తనపై వస్తున్న ఆరోపణలపై వనితారెడ్డి ఇప్పటివరకూ స్పందించక పోవడం అనుమానాలకు తావిస్తోంది.
వనితారెడ్డిది సొంతూరు తూర్పు గోదావరి జిల్లాలోని పెడమర్తి. సినిమాల్లో నటిస్తూ విజయ్ సాయితో పరిచయం ఏర్పడ్డాక.. ప్రేమించి కులాంతర వివాహం చేసుకుంది. అయితే ఓ పాప పుట్టిన తర్వాత మనస్పర్ధల కారణంగా విజయ్‌తో విడాకులు తీసుకుంది. విడాకుల సమయంలో భరణంగా భారీ మొత్తాన్ని డిమాండ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ‘అబ్బో ఆడవాళ్లు’ చిత్రంలో వనిత కీలక పాత్ర పోషించింది. ‘అనుమానాస్పదం’ చిత్రంలోనూ నటించింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసింది. ప్రస్తుతం టీవీ సీరియల్స్‌లో నటిస్తున్నట్లు సమాచారం.
తన కొడుకు చావుకు కారణం కోడలు వనిత అని విజయ్ సాయి తల్లి మీడియాకు వెల్లడించారు. మూడు సంవత్సరాలుగా ఇద్దరూ విడిగానే ఉంటున్నారని, ఆమె చేస్తున్న పనుల వల్లే తన కొడుకు మనోవేధనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె తెలిపారు.