టాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు విజయ్ సాయి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తుండగా అనేక ట్విస్టులు బయటపడుతున్నాయి. సూసైడ్ చేసుకోవడానికి ముందు విజయ్ సెల్ఫీ వీడియోను రికార్డ్ చేశారని… సంఘటన స్థలంలో పోలీసులు విజయ్ ఫోన్‌లో సెల్ఫీ వీడియోను గుర్తించారని.. దీంతో సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సెల్ఫీ వీడియోలో తన చావుకు గల కారణాలను విజయ్ స్పష్టంగా వివరించారు. మొత్తం ముగ్గరు వ్యక్తుల వల్ల తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. తన భార్య వనిత, శశిధర్, అలాగే లాయర్ శ్రీనివాసరావు వేధింపులతో విసుగుపోయానని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని వీడియో తెలిపినట్లు సమాచారం.
రెండేళ్ల నుంచి కోర్టులో విడాకుల కేసు నడుస్తోందని, తన నుంచి భరణం కోరుతూ కోర్టులో వనిత కేసు వేసిందని విజయ్ సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. కేసు విత్‌డ్రా చేసుకోవాలంటే 3 కోట్లు ఇవ్వాలని వనిత డిమాండ్ చేసిందని, దీనికి ఒప్పుకోకపోవడంతో శశిధర్, లాయర్‌తో కలసి తీవ్రంగా వేధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజుల క్రితం తన ఇంటికి వచ్చి గొడవ చేసిందని.. కారు, ఖరీదైన వస్తువులు తీసుకెళ్లిందని చెప్పారు. ఈ వేధింపులు తాళలేకే సూసైట్ చేసుకుంటున్నానని సెల్ఫీ వీడియోలో విజయ్ స్పష్టంగా పేర్కొన్నారు. తన చావుకు గల కారణాలతో పాటు భార్య వనిత గురించి సంచలనాత్మక విషయాలను వెల్లడించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
వాల్ పోస్టర్ సినిమా షూటింగ్‌లో వనిత నాకు పరిచయం అయిందని.. పెళ్లి అయిన తర్వాత వనిత నిజస్వరూపం తెలిసిందని.. వ్యాపార అవసరాల కోసం నా భార్యను కొంతమంది పారిశ్రామికవేత్తలు ఉపయోగించుకున్నారని.. ఆ విషయం తెలిసినప్పటి నుంచి నాకు, వనితకు అనేకసార్లు గొడవలు అయ్యాయని.. చివరకు నా కూతురు కుందనను కూడా చూడనివ్వలేదని విజయ్ తాను తీసుకున్న సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. తన భార్యకు గతంలో అమ్మిరెడ్డి అనే వ్యక్తితో వివాహం జరిగిందని చెప్పారు. వనిత, ఆమె తల్లి వ్యభిచారం చేసేవారని.. వారి సొంతూరుకు వెళ్తే ఈ విషయం తెలిసిందని విజయ్ పేర్కొన్నారు. ఇలాంటి వారిని వదలొద్దంటూ తన ఆవేదనను వెల్లబుచ్చుకున్నారు. చివరిగా డాడీ.. ఎవరినీ విడిచిపెట్టొద్దు. నిద్ర పట్టడం లేదు. అందరికీ శిక్ష పడేలా చూడు. లవ్ యూ డాడీ. కుందన అలాంటి వాతావరణంలో పెరగడం నాకు ఇష్టం లేదు. తీసుకొని రండి డాడీ. ప్లీజ్ డాడీ.. అంటూ సెల్ఫీ వీడియోలో విజయ్ ప్రాదేయపడ్డాడని పోలీసు వర్గాలు వెళ్ళడించాయి.