తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది . వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 3,943 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వైద్య విధాన పరిషత్ ఆస్పత్రులకు కొత్త పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1,191 సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, 685 డిప్యూటీ సివిల్ సర్జన్లు, 453 ఆర్‌ఎంవో, 562 స్టాఫ్ నర్సు ఉద్యోగాలతో పాటు ఇతర పోస్టులు మంజూరు అయ్యాయి.
