జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే. ప్రశ్నించడానికే పార్టీ పెట్టామన్న పవన్ తాజాగా విశాఖ, పోలవరం, విజయవాడల్లో మాట్లాడుతూ.. లౌక్యం లేకుండానే కామెంట్లు చేశాడు. రాజకీయాల్లో ఉన్నవారు. రాజకీయాలు చేయాలనుకున్నవారు.. లౌక్యంతోనే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది తప్ప.. మరొకరిని కాపాడే పరిస్థితి ఉండదు. అయితే పవన్ చేసిన వ్యాఖ్యల్లో మాత్రం ఏమాత్రం లౌక్యం కనిపించడం లేదు.
2014 ఎన్నికల్లో కేంద్రలో బీజేపీకి, రాష్ట్రంలో టీడీపీకి మద్దతు ఇచ్చిన జనసేన.. ఆ రెండు పార్టీలు అధికారంలోకి వచ్చాక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్కూల్ తాత్కాలికంగా కొంత కాలం మూసేసారు. ఎక్కువ సినిమాలకే తన సమయం కేటాయిస్తూ వచ్చారు. జనసేన పార్టీ నిర్మాణం అదిగో ఇదిగో అంటూ ట్విట్టర్ కే పరిమితం అయ్యారు. అడపాదడపా రాజధాని భూముల కోసం రైతులకోసం నేను అంటూ ఇలా ఆరు నెలలకో సమస్యపై మాత్రమే గ్రౌండ్ లోకి వచ్చి రెండు మూడు రోజుల హడావుడి చేయండం మళ్ళీ కామ్ అయిపోవడం.. పవన్ చేసే వ్యాఖ్యలు పూర్తిగా టీడీపీకి అనుకూలంగా ఉండడంతో.. పవన్ టీడీపీ తొత్తు అని ప్రజల్లో బలంగా నాటుకుపోయింది.
ముఖ్యంగా చంద్రబాబు నెత్తి మీదకి ఏ సమైస్యైనా వచ్చిన వెంటనే.. నేనున్నానంటూ.. పవన్ రావడం.. ఆ టాపిక్‌ని డైవర్ట్ చేయడంతో పాటు.. అధికారం పార్టీని వదిలేసి ప్రతిపక్షం పై వ్యాఖ్యలు చేయడంతో జనాల్లో తన విలువను కోల్పోయారని రాజకీయ వర్గీయులు సైతం అభిప్రాయ పడుతున్నారు. దీంతో ప్రశ్నించడానికి వచ్చామన్న జనసేన పార్టీలో విశ్వసనీయత లేదని.. ఇంకా జనసేన వెంట ఉండడం అనవసరమని.. ఆ పార్టీ నుండి ముఖ్యకార్యకర్తలు ఒక్కొక్కరుగా యూటర్న్ తీసుకుంటున్నారు. తాజగా జనసేనలో ముఖ్యకార్యకర్తగా ఉన్న గంటా స్వరూప జనసేన నుండి బయటకి వచ్చిందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.. ఆమె ఫేస్‌బుక్ పేజ్‌లో నేను తాత్కాలికంగా దూరమవుతున్నాని చెప్పినా.. ఈ జనసేనాని వల్ల ఏమి కాదని.. ఆయన మాటలరాయుడే తప్ప.. కోతల రాయుడు కాదని.. ఆ కోతలన్నీ చంద్రబాబు కోసమే అని.. అందుకే ఒక్కొక్కరుగా పార్టీ నుండి జారుకుంటున్నారని సోషల్ మీడియాలో సర్వత్రా చర్చించుకుంటున్నారు.