కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవి కోసం రాహుల్ మాత్రమే నామినేషన్ దాఖలు చేయడం, నామినేషన్ ఉపసంహరణ గడువు ఈ మధ్యాహ్నం మూడు గంటలతో ముగియడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.
89 nomination proposals were received,all were valid.Since there was only one candidate.I hereby declare Rahul Gandhi elected as the president of Indian National Congress: Mullappally Ramachandran,Congress pic.twitter.com/JqKYXlsGOb
— ANI (@ANI) December 11, 2017
రాహుల్ ఎన్నికను కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మూలపల్లి రామచంద్రన్ ప్రకటించారు. ఒక అభ్యర్థి పేరు మీదే మొత్తం 9 నామినేషన్లు వచ్చాయి. రాహుల్‌కు పోటీగా ఎవరూ లేరు. దీంతో ఆయననే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రకటిస్తున్నాం. ఈ నెల16న ఏఐసీసీ హెడ్‌క్వార్టర్స్‌లో అధికారికంగా రాహుల్ పగ్గాలు చేపడుతారు అని రామచంద్రన్ వెల్లడించారు.