జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తమ్ముడు సినిమా షూటింగ్ నుండి టీడీపీ దివంగత నేత పరిటాల రవి గ్యాంగ్ ఎత్తుకెళ్ళి చితక్కొట్టి పవన్‌కి గుండు కొట్టి సాగనంపారనే వార్త అప్పట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ సంఘటన జరిగిన దశాబ్దాల తర్వాత పవన్ తొలిసారిగా ఇటీవల స్పందించిన సంగతి తెలిసిందే. తనకి పరిటాల రవి గుండుకొట్టించారని గతంలో జరిగిన ప్రచారం.. అవాస్తవమని, తాను సినిమాలతో విసిగిపోయి గుండుకొట్టించుకున్నానని, అప్పుడు తనకు పరిటాల రవి ఎవరో కూడా తెలియదని పవన్ ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు తాజాగా పవన్ గుండు కథనం పై పరిటాల సునీత స్పందించారు. తన భర్త పరిటాల రవి అలాంటి పనులు చేయలేదన్నారు. పవన్ కల్యాణ్ చెప్పింది వాస్తవమేనన్నారు. పరిటాల పై కొందరు అప్పట్లో అనవసర ప్రచారానికి దిగారన్నారు. భర్తకు పవన్ కల్యాణ్‌కు సంబంధమే లేదన్నారు. పవన్ కు పరిటాలకు అసలు గొడవ ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. తన భర్త అంత మూర్ఖుడు కాదని, ప్రజలు అసత్యపు ప్రచారాన్ని నమ్మకుండా నిజానిజాలు తెలుసుకోవాలని పరిటాల సునీత విజ్ఙప్తి చేశారు.