తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లా రాజకీయాల్లో బ్రదర్స్ గా ముద్రపడిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,సోదరుడు ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికార టీఆర్ఎస్ పార్టీ శ్రేణులపై విరుచుకుపడుతున్నారు .ఈ క్రమంలో ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ “నకిరేకల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే వేముల వీరేశం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరల గెలుస్తా నేను రాజకీయాల నుండి తప్పుకుంటా అని సవాలు విసిరాడు .
కోమటిరెడ్డి విసిరిన సవాలుపై వేముల వీరేశం స్పందిస్తూ నేను రాజీనామా చేసి ఎన్నికల్లో గెలుస్తాను .ఒకవేళ నేను గెలిస్తే అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి ఇద్దరు తమ పదవులకు రాజీనామా చేసి రాజకీయ సన్యాసం చేస్తారా అని ప్రతిసవాలు విసిరారు .ఒకవేళ వాళ్ళిద్దరూ ఒకే అంటే ఇప్పుడే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తాను అని వేముల వీరేశం సవాల్ విసిరారు ..