Home / SLIDER / హైద‌రాబాద్‌లో మోనో రైలు..మంత్రి కేటీఆర్ వెల్ల‌డి

హైద‌రాబాద్‌లో మోనో రైలు..మంత్రి కేటీఆర్ వెల్ల‌డి

విశ్వ‌న‌గ‌రంగా ఎదుగుతున్న హైదరాబాద్ ఖాతాలో మ‌రో ప్ర‌త్యేక‌త చేర‌నుంది. పాస్ట్ గ్రోయింగ్ సిటీలో మోనోరైలును ప్ర‌వేశ‌పెట్టేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖామంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు వెల్ల‌డించారు. ప్ర‌ఖ్యాత రియ‌ల్ ఎస్టేట్ సేవ‌ల సంస్థ సీబీఆర్ఈ కార్యాల‌యాన్ని ప్రారంభించిన సంద‌ర్భంగా మంత్రికేటీఆర్ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ ప్ర‌జ‌ల‌కు మెట్రో అందుబాటులోకి వచ్చేసిందని… ఇప్పుడు హైదరాబాద్ మెట్రో లేకుండా లైఫ్‌ లేదని అన్నారు.

హైదరాబాద్ తో పోల్చితే 1,2 లక్షల మంది ప్రయాణికు ప్రయాణిస్తున్నార‌ని మంత్రి కేటీఆర్ తెలిపారు. వచ్చే ఏడాది మెట్రో అంతా ప్రారంభం అవుతుంద‌న్నారు. మెట్రో ఎయిర్ పోర్ట్ వరకు విస్తరిస్తామన్నారు. 54 చౌరస్తా లో ట్రాఫిక్ నియంత్రణ ఎర్పాటు జరుగుతున్నాయ‌న్నారు. మోనో రైలు ప్రారంభం జరుగుతుందని తెలిపారు. ఈ విష‌యంలో ప్లాన్ చేస్తున్నామన్నారు. గత మూడు సంవత్సరాలుగా…ట్రాఫిక్ ఇబ్బందులు తొలిగింపున‌కు ప్రయత్నాలు జరుగుతున్నాయని వివ‌రించారు. దేశ రాజ‌ధాని, ఢిల్లీ, బెంగుళూరు  కంటే చాల సుర‌క్షిత‌మైన న‌గ‌ర‌మ‌ని అన్నారు. హైదరాబాద్ కు ఎలాంటి తుఫాన్లు, భూకంపాలు వంటి ముప్పులేద‌న్నారు.

మూడేళ్లకింద‌ట ఆఫీస్ స్పేస్ ఆక్యుపేష‌న్‌ 3.5% ఉండ‌గా…పెద్ద ఎత్తున పెరిగి ఇప్పుడు 71/2 శాతంకు చేరిందని మంత్రి కేటీఆర్ అన్నారు. టీహ‌బ్ ద్వారా దేశ‌వ్యాప్తంగా గుర్తింపు పొందామ‌ని పేర్కొంటూ  హైద‌రాబాద్‌లోనే ఇండియా లార్జెస్ట్ ఇంక్యుబేటర్ కేంద్రంగా టీహ‌బ్‌2ను నిర్మిస్తున్నామ‌ని, ఇమేజ్ టవర్స్ సైతం తీర్చిదిద్దుతున్నామ‌న్నారు. వరల్డ్ లార్జెస్ట్ ఫార్మా క్లస్టర్‌ను న‌గ‌రంలోనే ఏర్పాటు చేస్తున్నామ‌ని మంత్రి కేటీఆర్ వివ‌రించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat