ఏపీ సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయిన మహేష్ కత్తి.. కొంత కాలం క్రితం వరకు ఎవరికీ తెలియని ఓ అనామకుడు.పవన్ రాజకీయాల పై విమర్శలు చేస్తూ.. రోజుకో హాట్ టాపిక్‌తో వార్తల్లోకెక్కుతున్న కత్తి మహేష్ప.. వన్ వంటి విశేష అభిమానులున్న సినీ హీరోను .. అన్నేసి మాటలు ఎలా అనగలుగుతున్నాడు.. ఆయన వెనుక ఎవరైనా ఉన్నారా.. అనే అనుమానాలు పలువురిలో వ్యక్తం అయ్యాయి.
అయితే కత్తి వెనుక ఓ పెద్ద హస్తమే ఉన్నట్టు సోషల్ మీడియాలో ఓ హాట్ టాపిక్ నడుస్తోంది. చిరంజీవి పీఆర్పీ పెట్టినపుడు వ్యతిరేకించిన ఒక పెద్దాయన సపోర్ట్ ఈ క్రిటిక్‌కి పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తోంది. సినీ ఇండస్ట్రీ తోనూ సంబంధాలున్న ఆ పెద్దాయన అండ వల్లే మహేష్ మరీ ధైర్యంగా ముందుకెళ్ళగలుగుతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఆ పెద్దాయన వెనకాల ఎవరున్నారనే విషయం సస్పెన్స్‌గా ఉంది అయతే సదరు పెద్దమనిషి కత్తి మహేష్‌ని దీనికి వాడుకోవడానికి కారణమేంటో చాలా మందికి అర్ధం కావడంలేదని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఈ వార్తలో నిజమెంతుందో తెలియకపోగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం ప్రతిరోజు కత్తి మహేష్ హాట్ టాపిక్ అవుతున్నారు.