జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాన్ తన తాజా చిత్రం అజ్ఞాతవాసి షూటింగ్ పూర్తి అనంతరం ఉత్తరాంధ్రలో ఈ నెల 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు పర్యటించిన విషయం తెలిసిందే. అయితే, ఓ వైపు పవన్ కల్యాన్ తన పర్యటనలో ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఉత్తరాంధ్రలో పర్యటిస్తూ ప్రజల సమస్యలపై స్పందించని చంద్రబాబు ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే.. మరో వైపు సినీ క్రిటిక్ కత్తి మహేష్ పవన్ ప్రసంగాన్నే బేస్‌గా చేసుకుని ఫేస్‌బుక్ వేదిగా కామెంట్స్ చేస్తూ నిత్యం వార్తల్లొకెక్కిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో నిత్యం కామెంట్స్ చేస్తున్న మహేష్ నోటికి ఎలాగైనా కళ్లెం వేయాలని పవన్ కల్యాణ్‌ను జనసేన కార్యకర్తలు కోరారట. అందుకు స్పందించిన పవన్ కల్యాణ్ ఇలా స్పందిస్తూ మహాత్మాగాంధీ మాటలను గుర్తు చేశారట. నిన్నెవరైనా కొట్టారనుకో తట్టుకో.. భరించు.. చివరకు కొట్టిన వ్యక్తే తప్పు తెలుసుకుని తనంతట తానే సైలెంట్ అయిపోతాడు అంటూ జనసేన కార్యకర్తలతో చెప్పాడట. అనవసరంగా అతని కామెంట్లపై స్పందించి సెలబ్రెటీని చేయాల్సిన అవసరం లేదన్నాడట పవన్ కల్యాణ్.
అలాగే, పవన్ కల్యాణ్ తన మామ అల్లు అరవింద్ నాడు ప్రజారాజ్యం పార్టీ సందర్భంగా చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ప్రసంగించిన విషయం తెలిసిందే. ఈ మాటలనే బేస్ చేసుకున్న కత్తి మహేష్.. ఏడవడం తప్పు కాదు. పవన్ కల్యాణ్! చేతకాక, చెప్పుకోలేక ఏడవటం తప్పు. ఆ విషయం ఇప్పుడు చెప్పి అల్లు అరవింద్ మీద పడి ఏడవటం అసలు తప్పు. అంటూ ఫేస్‌బుక్ పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే.