టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. ‘అమ్మాయిలు అబ్బాయిలు’ తదితర మంచి మంచి చిత్రాల్లో నటించిన కమేడియన్ విజయ్ హైదరాబాద్ యూసుఫ్ గూడ లోని తన ఫ్లాట్లో ఆత్మహత్య చేసుకున్నాడు . సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో విజయ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం . విజయ్ కొంతకాలంగా డిప్రెషన్ తో భాధపడుతున్నాడని అతని స్నేహితులు తెలిపారు ..కాగా అతని మృతిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. విజయ్ ఆత్మహత్యపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది…