ఏపీ విభజన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే గత ఎన్నికల్లో బాబు గెలుపుకి ఏవైతే కారణాలు అయ్యాయో.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అవే చంద్రబాబు ఓటమికి కారణాలు కానున్నాయని జాతీయ మీడియా ఓ సంచలన కథనాన్ని ప్రచురించింది. అసలు 2014 రాష్ట్రం విడిపోయి నప్పుడు ఏపీలో వైసీపీకి గొప్ప ప్రజాదరణ ఉన్నా.. అధికారంలోకి టీడీపీ ఎలా వచ్చందంటే.. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ పరిస్థితి.., అనుభవంతో ఆయన ఏదో చేస్తారన్న ఆశ.., చంద్రబాబు ఇష్టానుసారం అవాస్తవికమైన వాగ్దానాలతో నమ్మించడం.., మోడీ హవా.., పవన్ కళ్యాణ్ మద్దతు.. ఇలా చంద్రబాబు గ్యాంగ్ గెలుపుకి ఈ ఐదు ప్రధాన కారణమయ్యాయని జాతీయ పత్రిక తేల్చేసింది.
ఇక ఇన్ని చేసినా కేవలం ఒకే ఒక్కశాతం లోపు ఓట్లతోనే టీడీపీ గెల్చిందని ఆ పత్రిక రాసింది. ఈ అయిదు కారణాల్లో ఏదయినా ఒకటి వైసీపీ ఒక్క శాతం ఓట్లు తీసుకుపోయి వుండొచ్చని ఆ పత్రిక అంచనా వేసింది. దీంతో గతంలో చంద్రబాబు ఏ కారణాలతో అయితే గెలిచాడో.., అవే కారణాలు ఆయన్ని ఓడిస్తాయని జాతీయ మీడియా అంచనా వేస్తోంది. ఏపీ విభజన పరిస్థితిలో రాష్ట్రానికి ఏమి చేయలేకపోవడం.., అనుభవం ఉన్నా దానిని ఉపయోగించలేకపోవడం.., అలాగే హామీలు నెరవేర్చలేకపోవడం.., మోడీపై ఆశలు సన్నగిల్లడం.., పవన్ ప్రత్యేక దారి చూసుకోవడం.., ఈ అయిదు కారణాలు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లలో చంద్రబాబుని ఓడిస్తాయని .. అలాగే వైసీపీ పట్ల విపరీతమైన ప్రహాభిమానం అనే ఆరో కారణం వైసీపీకి అధిక మెజారిటీ అందిస్తుందని ఆ పత్రిక ప్రచురించిన కథనంలో పేర్కొంది. దీంతో తాజాగా జాతీయ పత్రిక ప్రచురించిన ఈ కథనం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.