ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా పోలవరం పై జనసేత అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. పవన్‌కు పోలవరం గురించి అర్ధం కాదని, జగన్ కు ఏమీ తెలియదని చంద్రబాబు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ప్రతిరోజూ తాను లెక్కలు చెబుతుంటే శ్వేతపత్రం ఎందుకన్నారు. శ్వేత పత్రం అంటే దానికి బంగారు రంగు పూసి ఇవ్వాలా అని ప్రశ్నించారు. నలభై ఏళ్లుగా తాను రాజీకీయాల్లో ఉన్నానని, అటువంటిది తనకే ఇరిగేషన్ ప్రాజెక్టుల పై పూర్తి అవగాహన లేదన్నారు. మరి ఇప్పడు మాట్లాడే వారికి ఏం అవగాహన ఉందని ప్రశ్నించారు. కొందరు అంతా తమకే తెలుసనని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని.. ఈ ప్రాజెక్టు పై అవగాహన పెంచుకుని మాట్లాడాలని విమర్శించారు. దీంతో సోషల్ మీడియాలో పవన్ పై సెటైర్లు పడుతున్నాయి.. గతంలో చంద్రబాబు లాగే కొందరు టీడీపీ నేతలు మెర్చ్యూరిటీ లేదని.. అసలు పవన్ అంటే తమకు తెలియదని.. ఇలా చాలా రకాలుగా పవన్ పై వ్యాఖ్యలు చేసినా.. పవన్ మాత్రం సిగ్గు లేకుండా ఎల్లో గ్యాంగ్‌తో దోస్తీ చేశాడు.. వాళ్లేమో పవన్‌ని ఒక పెయిడ్ డ్రామా ఆర్టిస్ట్‌లా ట్రీట్ చేస్తున్నారు.. పవన్‌కి జ్ఙానోదయం అవుతుందో అని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
