ఏపీ అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత సార్వత్రిక ఎన్నికల్లో కురిపించిన ఆరు వందల ఎన్నికల హామీల్లో ప్రధానమైనది ఇంటికో ఉద్యోగం .సర్కారు నౌకరి కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నా నిరుద్యోగ యువతకు బాబు ఇచ్చిన హామీతో ఆకర్షితులై టీడీపీ పార్టీకి ఓట్లు వేశారు .
తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఇంటికో ఉద్యోగం కాదు కదా కనీసం ఊరుకో ఉద్యోగం ఇవ్వలేదు అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా అనంతపురం జిల్లాలో విమర్శల పర్వం కురిపించారు .ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో తప్పుడు హామీలను కురిపించి అధికారంలోకి వచ్చాడు .అందులో భాగంగా ఎన్నికల్లో గెలుపుకోసం ఇంటికో ఉద్యోగం అన్నాడు .తాజాగా రానున్న ఎన్నికల్లో ఇంటికో మారుతి కారును గిఫ్ట్ గా ఇస్తాను అని అధికారం కోసం ఏదైనా చేస్తాడు అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శలు ఎక్కుపెట్టారు .