టీమిండియా కెప్టన్ విరాట్ కోహ్లి.. బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మలు ఇటలీలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇప్పటికే వారి పెళ్లికి ఇరు కుటుంబాల సభ్యులు కలిసి విదేశాలకు వెళ్లారని.. కోహ్లి వివాహం గురించి అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంటే.. జ్యోతిష్కులు మాత్రం వారి పెళ్లి భవిష్యత్తులో పెటాకులు అవుతోందని హెచ్చరిస్తున్నారు. ఎలా ఉంటుందో అంచనా వేసే పనిలో పడ్డారు. పెళ్లయిన తర్వాత విరాట్, అనుష్క మరిన్ని విజయాలు అందుకుంటారని వారు చెబుతున్నారు.
అనుష్క- విరాట్‌ల పెళ్లి గురించి ప్రముఖ జ్యోతిష్కుడు మాలవ్ భట్ మాట్లాడుతూ.. అనుష్క, విరాట్ మధ్య భావోద్వేగమైన విభేదాలు వచ్చే అవకాశం ఉందని.. ఆ కారణంగా వారి దాంపత్య జీవితానికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని వెల్లడించారు. ఇక అనుష్క, విరాట్ జీవితంపై గ్రహాల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. వారి దాంపత్య జీవితంలో రానున్న రెండు సంవత్సరాలు చాలా కీలకమని.. వారి గ్రహాల పరిస్థితిని బట్టి వారి దాంపత్య జీవితం ముందుకెళ్లే అవకాశాలు ఉంటాయని చెప్పారు. అంతే కాకుండా జోతిష్యం ప్రకారం ఆ ఇద్దరి వైవాహిక జీవితంలో కలతలు ఏర్పడే అవకాశం ఉందని.. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా అనేక ఒడిదుడుకులు ఏర్పడుతాయని దాంతో వారి జీవితంలో ప్రశాంతత లోపిస్తోందని పలువురు జ్యోతిష్కులు హెచ్చరిస్తున్నారు. మరి పెళ్లి తర్వాత వీరి జీవితం ఏమలుపు తీసుకుంటుందో కాలమే నిర్ణయిస్తోందని సోషల్ మీడియాలో సర్వత్రా చర్చిస్తున్నారు.