సినీ నటుడు శివాజీ మరోసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డాడు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదాపై దీక్షలు, నిరసనలు చేస్తున్న వారికి మద్దతు తెలుపుతూ, యువతలో ఉత్సాహాన్ని నింపుతూ గళమెత్తిన శివాజీ గత కొంతకాలంగా సైలెంటైన విషయం తెలిసిందే. అయితే, తాజాగా సినీ నటుడు శివాజీ మీడియా ముందుకొచ్చాడు.
చాలా మంది నాయకులు ఈ మధ్యన మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాతో ఏమొస్తుంది..? ప్రత్యేక హోదా ఏమన్నా టానిక్కా..? అంటూ ప్రశ్నిస్తున్నారన్నారు. అవును, మాకు ప్రత్యేక హోదానే టానిక్, ప్రత్యేక హోదాను ఇవ్వండి, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తే పోయేదేంటో చెప్పండి అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డాడు శివాజీ. ఎవడబ్బ సొమ్ము ఉందని బీహార్‌కు లక్షా 20వేల కోట్లు ఇచ్చారు అంటూ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అలాగే, ఫిజీ ఐలాండ్‌కు వెళ్లి అక్కడ 400 కోట్ల రూపాయలు డొనేషన్‌గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందన్నారు.
అయ్యా,.. ఆంధ్రప్రదేశ్‌లో రైతులు బిడ్డల్ని, ఆడపిల్లల్ని అమ్ముకుంటున్నారు. మీరు సాయం చేయండ్రా అంటే 700 కోట్లా..! ఏంట్రా మేం చేసిన పాపం, ఏ పాపం చేసింది ఈ ప్రాంతం చెప్పండి. ఏంట్రా మాకీ దరిద్రం. ఈ ప్రాంత యువతకు ఉద్యోగాలు అవసరం లేదా..? ఈ ప్రాంతంలో ప్రజలకు సుఖంగా బతికే ఛాన్స్ ఇవ్వరా..? మా కరెంట్ తీసుకుపోతున్నారు.. ప్రతీ ఒక్కటీ కూడా మా వద్దనుంచే తీసుకుపోతున్నారు. కోస్తా జిల్లాలోని సంపదను కూడా సంపాదించుకునేందు మేము మీ కాళ్లు పట్టుకోవాల్సి వస్తొంది ఏంట్రా మీకీ కర్మ అంటూ శివాజీ తన అసహనాన్ని మీడియా సాక్షిగా వెళ్లగక్కారు. నాటి దివగంత ముఖ్యమంత్రులు నందమూరి తారకరామారావు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డిలు అప్పటి కేంద్ర ప్రభుత్వాలను ఉచ్చ పోయించారన్నారు. ఆ ఛావంతా ఏమైపోయింది ఇప్పుడు అంటూ చంద్రబాబు సర్కార్‌పై విమర్శలు గుప్పించారు.