ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడుపై పలు అవినీతి ఆరోపణలు ,అక్రమాలు చేస్తున్నట్లు విమర్శలు ఉన్న సంగతి తెల్సిందే .రాష్ట్రంలో వైజాగ్ లో జరిగిన భూకుంభకోణంలో కూడా లోకేష్ పాత్ర ఉంది అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ .
ఏకంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అండ్ టీమ్ గత నాలుగు ఏండ్లుగా దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు అని వైసీపీ బుక్ రీలీజ్ కూడా చేశారు .తాజాగా వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి ,ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మంత్రి నారా లోకేష్ నాయుడు నాయకత్వంలో అవినీతి అక్రమాలు ఎలా చేయాలో శిక్షణ కార్యక్రమాలు ఇప్పిస్తున్నారు .
అంతే కాకుండా లోకేష్ నాయుడుకు అవినీతి అక్రమాలు చేయడంలో ప్రత్యేకంగా శిక్షణ ఇప్పిస్తున్నారు .ఇప్పటికే ఆరితేరిన లోకేష్ ఈ శిక్షణ కార్యక్రమాలతో ప్రపంచంలోనే నెంబర్ వన్ అవినీతి పరుడుగా చరిత్ర సృష్టిస్తారు అని ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపించారు .