తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు అయిన టీడీపీ ,కాంగ్రెస్ ,బీజేపీ పార్టీల నుండి అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు గత నాలుగు ఏండ్లుగా చేస్తున్న పలు ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై మాజీ ఎమ్మెల్యేల దగ్గర నుండి కింది స్థాయి సామాన్య కార్యకర్త వరకు అందరు గులాబీ కండువా కప్పుకోవడానికి ముందుకు వస్తున్నారు .ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని భద్రాది -కొత్తగూడెం జిల్లాలో అధికార పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి .తాజాగా జిల్లాలో సుజాతనగర్ లో రెండు వందల కుటుంబాలు అధికార పార్టీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ సర్కారు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీ మారుతున్నాం అని తెలిపారు ..
