ఈ సమాజంలో అంబేద్కర్‌ను నిజంగా గౌరవించే వారు.. వారి ఆలోచనా విధానంలో కులాల ప్రస్థావనను తీసేయాలన్నారు జనసేన అధినేత పవన్ కల్యాన్. కాగా, ఇటీవల రాజమండ్రిలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అందరరిని నాలా మారమని చెప్పను.. ఎందుకంటే మీకున్న సాంఘీక పరిస్థితిలు, సంస్కృతులు వేరు. అలాగని, కులాలను నేను తక్కువ చేయమని అనను అంటూ జనసేన కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు. కులం ఒక సామాజిక సత్యం. కానీ, ఆ సామాజిక సత్యాన్ని అధికారం అనే కుర్చీని అందుకునేందుకు వాడుకుంటున్నారన్నారు. అయితే, నేను కూడా కులాలను గౌరవిస్తా… కానీ కులానలు వెనకేసుకురాను దయచేసి ఇది జనసేన సిద్ధాంతం అంటూ మాట్లాడారు.
అనంతరం ప్రజారాజ్యం పార్టీ విలీనంపై ఓ కార్యకర్త అడిగిన ప్రశ్నకు పవన్ సమాధానం చెబుతూ.. ప్రజారాజ్యం పార్టీ విలీనం సమయంలో తాను నిస్సహాయుడినని, అందుకే తాను కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం విలీనాన్ని ఆపలేకపోయానన్నారు. అందులోను ఆ సమయంలో పార్టీ వ్యవహారాలు చూసే అల్లు అరవింద్ తనకు అంత ప్రాధాన్యతను ఇచ్చేవారు కాదన్నారు. అల్లు అరవింద్ నన్ను కేవలం ఒక నటుడుగానే చూశారని, ఆ సమయంలో ప్రచారానికి వెళ్లాల్సి వస్తే తనను సంప్రదించే వారు కాదని, బన్నీ, లేదా చరణ్‌లను మాత్రమే సంప్రదించే వారని అన్నారు. తన కొడుకుతోపాటు. మేనల్లుడుతోపాటు నన్ను కూడా ఒక నటుడుగానే చూశారని, నాలో ఉన్న సామాజిక స్పృహ అల్లు అరవింద్‌కి కనిపించలేదన్నారు. అటువంటి నిస్సహాయ స్థితిలో చాలా మధనపడ్డానని, కన్నీళ్లు కూడా వచ్చేవి కావని నాటి సంగతులను జనసేన కార్యకర్తలతో పంచుకున్నారు పవన్ కల్యాణ్. ప్రజా రాజ్యం పార్టీ స్థాపించినప్పుడు హడావుడి చేసిన అల్లు అరవింద్.. పార్టీ విలీనం సమయంలో స్పందించకపోవడాన్ని పవన్ కల్యాణ్ ప్రశ్నించాడు.