దేశంలో మహిళలపై అత్యంత దారుణంగా దాడులు జరుగుతున్నాయి. కొంత మంది దుర్మార్గులు కళ్లు మూసుకపోయి ప్రవర్తిస్తున్నారు. ఒక నేరం చేసి జైలుకు వేళ్లి వచ్చిన …లేదా నలుగురితో మాట పడి..తన్నులు తిన్న మళ్లీ అదే తప్పు చేస్తున్నారు. ఇకపోతే కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో కట్టుకున్న భార్య కాళ్లూ, చేతులు..చివరికి జననాంగాలపై ఇస్త్రీ పెట్టెతో వాతలు పెట్టాడు. ఆ కిరాతకుడి పేరు రంగనాథ్. ప్రైవేట్ కాలేజీ బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అయితే అతనికి ఇంతకముందే మరో యువతితో పెళ్లి జరిగింది.
తరువాత మంజులాదేవి అనే విద్యార్థినిని ప్రేమించి మరో పెళ్లి చేసుకున్నాడు.ఆమె రోజూ కాలేజీకి వెళ్లి వచ్చే బస్సు డ్రైవర్గా పనిచేసే రంగనాథ్.. మంజులను ప్రేమించినట్టు నటించాడు. ఆమెను లోబరచుకున్నాడు. ఆమెతో శారీరక సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు.ఆమె పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి తీసుకొచ్చారు. మొదట్లో రంగనాథ్ ఈ పెళ్లికి అంగీకరించలేదు. దీనితో ఆమె పోలీసుల సహాయాన్ని తీసుకున్నారు. పోలీసులు దగ్గరుండి పెళ్లి చేశారు. పెళ్లయిన తరువాత ఇద్దరు భార్యలనూ ఒకే ఇంట్లో పెట్టాడు. రెండో పెళ్లి చేసుకోవడం, రెండో భార్యను ఇంటికి తీసుకు రావడంతో మొదటి భార్య నచ్చలేదు. దీనితో ఆమె రోజూ రంగనాథ్తో గొడవ పడేది. దీన్ని భరించలేక రంగనాథ్ రాక్షసుడిలా మారాడు. రెండో భార్య మంజులను దారుణంగా హింసించడం మొదలు పెట్టాడు.ఇస్త్రీ పెట్టెతో ఆమెకు ఒళ్లంతా వాతలు పెట్టాడు. జననాంగాలపైనా వాతలు పెట్టాడు. దీనితో మంజుల మరోసారి పోలీసులను ఆశ్రయించారు. అతనిపై కేసు నమోదు చేసిన తుమకూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.