గుజరాత్ అసెంబ్లీ తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.తొలి దశలో 89 స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5గంటల వరకు జరుగనుంది.ఈ క్రమంలో భారత టెస్టు క్రికెటర్ ఛటేశ్వర్ పుజారా గుజరాత్ ఎన్నికల్లో భాగంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజ్‌కోట్‌లోని రవి విద్యాలయ బూత్‌లో పుజారా ఓటేశారు.
Cricketer Cheteshwar Pujara casts his vote in Rajkot's Ravi Vidayalaya booth. #GujaratElection2017 pic.twitter.com/NobynWfp6P
— ANI (@ANI) December 9, 2017
మొత్తం 89 స్థానాల్లో తొలివిడత ఎన్నికల బరిలో గుజరాత్ సీఎం విజయ్ రూపాని సహా 977 మంది అభ్యర్థులు బరిలో దిగారు. ఈ నెల 14న మిగిలిన స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 18న గుజరాత్ అసెంబ్లిస ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది.