గత మూడు రోజులుగా ఏపీలో పర్యటన చేస్తూ…రాజకీయాల్లో వేడిని పెంచినాడు. అధికార పార్టీ టీడీపీపై, ప్రతిపక్షం వైసీపీపై ,కులాలపై తీవ్రంగా మండిపడ్డాడు జనసేన అధినేత పవన్‌కల్యాణ్. తాజాగ ఒంగోలులో పర్యటించిన పవన్ కృష్ణా జిల్లా పడవ ప్రమాద మృతుల కుటుంబాలను పరామర్శించారు. నగరంలోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో మృతుల బంధువులు ప్రమాదం గురించి పవన్‌కు వివరించారు. అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ‘విహార యాత్రకు వెళ్లి మృత్యువాతపడటం చాలా బాధాకరం. బాధితులకు న్యాయం జరగాలి, పరిహారాలతో పోయిన ప్రాణాలు తిరిగిరావు. ప్రమాదానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. పోయిన ప్రాణాలు తిరిగి తీసుకురాలేం. అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి. ప్రభుత్వాన్ని అనడం కాదు.. అధికారులు మనసుపెట్టి పనిచేయాలని అన్నారు.
అఖిలప్రియ బాధ్యత వహించాలి
ఈ పడవ ప్రమాదానికి పర్యాటకశాఖ మంత్రి అఖిలప్రియదే బాధ్యత అని పవన్‌కల్యాణ్ విమర్శించారు. కొద్దికాలం వ్యవధిలోనే తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయిన అఖిలప్రియకు తల్లిదండ్రులు లేని బాధ గురించి చెప్పవలసిన అవసరం లేదని ఆయన అన్నారు. 18 మంది మృతి చెందడం, నష్టపరిహారాలతో తీరే బాధ కాదని తెలిపారు. సంబంధితశాఖ మంత్రిగా ఉన్న అఖిలప్రియ సీఎం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు నేరుగా బాధిత కుటుంబాలను పరామర్శించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. ఇంతవరకు ఆమె బాధిత కుటుంబసభ్యులను కలవకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. మరి పవన్ మాటలకు అఖిలప్రియ ఏం సమదానం చేబుతుందో చూడలి.
