ఏపీలో రోజు రోజుకు రాజకీయాలు రణరంగంగా మారుతున్నాయి. అయితే, ఓ వైపు చంద్రబాబు సర్కార్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత.. మరో వైపు అంతకంతకు పెరుగుతున్న ప్రతిపక్ష బలం.. ఇలా రెండూ బేరీజు వేసుకుంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సహజమే అయినప్పటికీ.. ప్రతిపక్ష నేతను టార్గెట్ చేస్తూ మరో కుట్రకు తెరలేపింది టీడీపీ.
అయితే, ప్రస్తుతం వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్రతో ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసిన అధికార పార్టీ కుయుక్తులను పన్నేందుకు రెడీ అవుతోంది. వైఎస్ జగన్‌ను ప్రత్యక్షంగా ఎదుర్కోలేక.. పరోక్షంగానైనా జగన్‌ను దెబ్బతీయాలనే ఆలోచనలకు చంద్రబాబు సర్కార్ తెరతీసింది. అయితే, ఈ కుట్ర కుతంత్రాలకు డిజిటల్ మీడియాను వేదికగా మార్చుకుందిటోంది టీడీపీ. అందులోనూ చంద్రబాబు కొడుకు నారా లోకేష్ ఐటీ శాఖ మంత్రి కావడంతో ఈ పని కాస్తా సులభంగా ఉంటుందని భావించింది చంద్రబాబు కేబినెట్.
అయితే, తాజా సమాచారం మేరకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్రతో వైసీపీపై ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను ఓర్వలేక సామాజిక మాధ్యమాల్లో విషప్రచారం చేసేందుకుగాను నారా లోకేష్ నాయకత్వంలో టీడీపీ వాలంటీర్లు, కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నారు. కాగా, ఈ శిక్షణా కార్యక్రమం నేటి నుంచి ప్రారంభమై మూడు రోజులపాటు కొనసాగనుంది. అయితే, ఈ కార్యక్రమం ఏపీ రాజధాని అమరావతి దగ్గర మంగళగిరిలో ఉన్న ఓ హోటళ్లో డిజిటల్ టీమ్‌కు శిక్షణ ఇస్తుండటం గమనార్హం.
మీ పని ప్రతిపక్షంపై దుమ్మెత్తి పోయడమే, దాంతోపాటు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై వస్తున్న ఆరోపణలను తిప్పికొడుతూ.. ప్రజల్లో టీడీపీపై మంచి అభిప్రాయం కలిగేలా చేయాలంటూ నారా లోకేష్ లక్ష మందికి శిక్షణ ఇస్తున్నారు. ఈ సమాచారం కాస్తా రాజకీయ విశ్లేషకుల చెవిన పడటంతో.. నారా లోకేష్ జగన్‌పై ఇంతలా విషప్రచారం చేయడానికి పూనుకోవడం అంటే.. ప్రతిపక్షం మరింత బలపడుతుండటమేనని అర్థమవుతుందంటున్నారు.