ఏపీ అధికార పార్టీ తెలుగుదేశానికి చెందిన సీనియర్ ఎంపీ ,ప్రముఖ పారిశ్రామిక వేత్త ,ప్రముఖ నటుడు మురళి మోహన్ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఫైర్ అయ్యారు .ఈ రోజు శనివారం ఎంపీ మురళి మోహన్ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు .
పర్యటనలో భాగంగా మురళి మోహన్ మాట్లాడుతూ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేశాడని జాలిపడి మీరు ఓట్లేసి గెలిపిస్తే ఏపీ ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళింది .ప్రస్తుతం ఎండ అనక వాన అనక పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పాదయాత్రను చూసి జాలిపడి వైసీపీ పార్టీకి ఓట్లు వేయద్దు .ఒకవేళ ఓట్లు వేస్తె ఏపీ సర్వనాశనం అవుతుంది అని ఆయన అన్నారు ..