జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తెలుగు సినీ క్రిటిక్ వీలు చిక్కినప్పుడల్లా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కత్తి మహేష్ ఎంత విమర్శించినా.. పట్టించుకోవద్దని తన అభిమానులకు పవన్ సూచించిన సంగతి తెలిసిందే. అయినా పవన్ అభిమానులు మాత్రం కత్తి పై కత్తి గట్టారని సోషల్ మీడియాలో వివరాలతో సహ బయట పడ్డాయి.
అసలు విషయం ఏంటంటే.. పవన్ అప్పుడప్పుడు అజ్ఙాతం వీడడం జనాల్లోకి వచ్చి హడావుడి చేయడంతో అన్ని రాజకీయ వర్గాల నుండి విమర్శలు వస్తున్నాయి. అలాగే మహేష్ కత్తి కూడా విమర్శలు చేస్తున్నారు. కత్తి నోరువిప్పిన ప్రతిసారీ పవన్‌కి పంచ్‌లు పడుతున్నాయి. పవన్ అజ్ఞాతవాసి కాదు, అజ్ఞానవాసి అని.. అయన చేసేది ప్రజా యాత్ర కాదు.. ప్రతీకార యాత్ర అని.. పీఆర్పీకి అన్నా 18సీట్లు వచ్చాయి.. జనసేనకి ఒక్క సీటు కూడా రాదని ఇలా వీలు చిక్కినప్పుడల్లా పవన్‌ని ఆడేసుకుంటున్నాడు.
అయితే కత్తి వ్యాఖ్యలు పవన్‌కి ఎలా ఉంటాయో తెలియదు గానీ.. పీకే ఫ్యాన్స్‌కి అయితే పుండు మీద కారం చల్లినట్టు ఉంటోంది. దీంతో చాలామంది నెట్లో కత్తి మహేష్ వివరాల కోసం, ముఖ్యంగా ఆయన ఫోన్ నంబర్ కోసం సెర్చ్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియా ముఖపుస్తకంలో అయితే కత్తి మహేష్ అని టైప్ చేయగానే.. కత్తి మహేష్ ఫోన్ నంబర్ అనే వస్తోంది.. అలాగే గూగుల్‌లో.. అతని పేరు టైప్ చేయగానే కత్తి మహేష్ క్యాస్ట్, కత్తి మహేష్ వైఫ్, కత్తి మహేష్ ఫోన్ నంబర్ అనే కీవర్డ్‌లు ఆటోమేటిగ్గా వచ్చేస్తున్నాయి. దీన్ని బట్టి పవన్ ఫ్యాన్స్ కత్తి మహేష్ పట్ల ఎంతటి ఆగ్రహంగా ఉన్నారో, ఆయన గురించి తెలుసుకోవాలని ఎంతలా కోరుకుంటున్నారో అర్థమవుతోంది. దీంతో సోషల్ మీడియాలో మహేష్ కత్తి వివరాల కోసం వేట సాగిస్తున్నారని.. ఆయన ఫోన్ నంబర్ పీకే ఫ్యాన్స్‌కి దొరికితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమని సర్వత్రా చర్చించుకుంటున్నారు.