టాలీవుడ్ సినీ క్రిటిక్ మహేష్ కత్తికి సంబందించిన ఒక వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఇటీవల టాలీవుడ్ దర్శకుడు శేషర్ కమ్ముల పై పవన్ చేసిన వ్యాఖ్యల పై కత్తి స్పందించాడు. ప్రధాని నరేంద్ర మోదీ లాంటి నర హంతకులకు సపోర్ట్ ఇచ్చిన నిన్ను.. మతోన్మాథులతో చెయ్యి కలపొద్దు అని చెప్పిన నీ అభిమాని నీకు చెడ్డోడులా కనిపించాడా.. మోదీ ప్రధని అయినంత మాత్రానా ఏం చేసినా రైట్ అయిపోయిద్దా.. నీ ఉన్నాథం ఏ స్థాయిలో ఉందో అర్ధం అవుతూనే ఉందని కత్తి ట్వీట్ చేయడంతో రాజకీయ వర్గాల్లో పెద్ద రచ్చకి తెరలేపింది.
దీంతో మోదీని నరహంతకుడు అన్నందుకు గానూ మహేష్ కత్తిని పోలీసులు అరెస్ట్ చేయాలని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నాడు. ఛీప్ పబ్లిసిటీతో ఫేమస్ అవడంకోసం దేశ ప్రధాని పై ఆరోపణలు చేయడం తగదని రాజా సింగ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా విమర్శించారు. మహేశ్ కత్తి పై కేసు నమోదు చేయాలని హైదరాబాద్ సిటీ పోలీస్‌కు విన్నవించుకుంటున్నానని తన ట్వీట్ ద్వారా కోరారు. ఈ ట్వీట్ కు హైదరాబాద్ సిటీ పోలీస్ కూడా వెంటనే స్పందిస్తూ.., అతని పై చర్యల నిమిత్తం సంబంధింత అధికారికి మేము వివరిస్తామని చెప్పారు. ఇక గతంలో ఇలాగే ప్రధాని మోదీ పై వ్యాఖ్యలు చేసిన ఎందరినో పోలీసులు అరెస్ట్ చేశారు. మరి ఇప్పుడు కత్తి మహేష్ కూడా పోలీసులు అరెస్టు చేస్తారా.. కత్తి జైలుకు వెళతారా అని రాజకీయ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.