జగన్ పాదయాత్రకి యధావిధిగా శుక్రవారం బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శుక్రవారం సీబీఐ కోర్టకు జగన్ హాజరయిన సంగతి తెలిసిందే. విచారణను ఈ నెల 15వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు. కోర్టు విచారణకు పూర్తయిన తర్వాత జగన్ వైసీపీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు, పోలవరం ప్రాజెక్టును వైసీపీ నేతల సందర్శన వంటి అంశాలపై జగన్ వారితో చర్చించారు. ఎల్లుండి పాదయాత్ర జరిగే దగ్గర వైసీపీ పార్లమెంటరీ సమావేశం ఏర్పాటు చేయాలని జగన్ నేతలను ఆదేశించారు. ఇక ఆ తర్వాత జగన్ రోడ్డు మార్గంలో బయలు దేరి అనంతపురం జిల్లా బాపన పల్లికి బయలు దేరారు. శనివారం నుంచి పాదయాత్రలో యధావిధిగా జగన్ తన పాదయాత్రలో పాల్గొంటారు.
