డబ్బు మాత్రం నెల కాగనే వెంటపడి..ముక్కుపిండి మరి వసూలు చేస్తారు.భద్రత,కనీస అవసరాలు కూడ తీర్చ కుండా హాస్టల్‌ను నడుపుతున్నారు. ఇది నగరంలో ఉమెన్ హాస్టళ్లను నడుపుతున్నావారు చేస్తున్న పని ..అంతేగాక అమ్మాయిల విషయంలో అజాగ్రత్త గా ఉన్నారు. ఉమెన్ హాస్టల్ నడుపుతున్నపుడు ఏంత జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి సెక్యూరిటి సిబ్బందిని పెట్టాలి….కాని చేయ్యడం లేదు అందుకే నేరాలు జరుగుతున్నాయి. తాజాగా ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తాను ఉంటోన్న వర్కింగ్ ఉమెన్ హాస్టల్‌లో స్నానం చేస్తుండగా ఆ హాస్టల్ నిర్వాహకుడి తనయుడు ఆ దృశ్యాలను తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించాడు. ఈ ఘటన బాగ్య నగరంలోని కేపీహెచ్‌బీ కాలనీ 5వ రోడ్డులో ఉన్న ఓ వర్కింగ్ ఉమెన్ హాస్టల్‌లో చోటు చేసుకుంది. .
ఇంటి దొంగలను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడన్నది సామెత. కొన్ని వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లలో గుట్టుచప్పుడు కాకుండా ఘోరాలు జరిగిపోతున్నాయి. దీనికి తాజా ఉదాహరణ.. కేపీహెచ్‌బీ కాలనీ 5వ రోడ్డులో ఉన్న ఓ వర్కింగ్ ఉమెన్ హాస్టల్‌లో జరిగిన ఘటన.తాను స్నానం చేస్తుండగా హాస్టల్ నిర్వాహకుడి తనయుడు మొబైల్ ఫోన్ ద్వారా చిత్రీకరిస్తుండడం గమనించిన సదరు టెక్కీ ఆ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. అయితే కేపీహెచ్‌బీ అడ్డగుట్ట సొసైటీ ప్రాంతంలో సుమారు 350కి పైగా హాస్టల్స్ ఉన్నాయి. వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్‌లోకి బయటి వ్యక్తులు ఎవరూ ప్రవేశించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోమని నిర్వాహకులకు సూచిస్తున్నారు.
Tags bathing crime hyderabad woman hostel