ప్రముఖ స్టార్ నటి హేమ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ టెన్ హీరోల్లో ఒకరైన ,జనసేన అధినేత పవర్ పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు .ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రజల్లో పర్యటిస్తున్న సంగతి తెల్సిందే .ఈ పర్యటనలో భాగంగా డీసీసీఐ ఉద్యోగుల ,ఫాతీమా కాలేజీ విద్యార్ధుల ,రైతులకు భరోసా ఇవ్వడానికి ..అండగా నిలబడతాను అని హామీ ఇవ్వడానికి ప్రజాక్షేత్రంలో పర్యటిస్తున్నారు .
గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ఎన్నికల హామీలలో భాగంగా కాపులను బీసీలల్లోకి చేర్చి ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఏకంగా ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సర్కారు అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టి ఆమోదించారు .దీనిపై ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో బీసీ వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది .పలు చోట్ల బాబు దిష్టి బొమ్మలను తగులబెడుతూ నిరసనలను వ్యక్తం చేస్తోన్నారు .
ఈ నేపథ్యంలో నటి హేమ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ “కాపు ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కల్సి కాపు ఉద్యమానికి మద్దతు కోరవచ్చు కదా అని పెద్దవార్ని అడిగాను .కానీ దానికి వారిచ్చిన సమాధానం చూసి నేను తీవ్ర షాక్ కు గురయ్యాను .వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కాపులను తన స్వార్ధానికి వాడుకుంటారు తప్పా ..కాపులకు అండగా ఉండరు ..అసలు ఇన్నాళ్ళు అయిన ఆయన ఏనాడూ కూడా తను కాపు సామాజిక వర్గానికి చెందిన వాడ్ని అని చెప్పుకోవడానికి కూడా ఇష్ట పడడు .అసలు కాపుల విషయం ఆయన పరమ వెస్ట్ అని చెప్పడంతో షాక్ కు గురయ్యాను అని ఆమె తెలిపారు ..