తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గత మూడున్నర ఏండ్లుగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులపై నిత్యం బిజీగా ఉంటూనే మరో వైపు తన దృష్టికి వచ్చిన పలు సమస్యలను పరిష్కరిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తగ్గ మేనల్లుడు అని పలుమార్లు నిరూపించుకుంటున్నారు .మాములు మెసేజ్ దగ్గర నుండి వాట్సాఫ్ మెసేజ్ వరకు సమస్య ఏ రూపంలో వచ్చిన కానీ వెంటనే స్పందించి దాని పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు మంత్రి హరీష్ రావు .
ఇటివల హైదరాబాద్ మహానగరంలో ఓయు విద్యార్ధి మురళి ఆత్మహత్య చేసుకొని మృతి చెందిన సంగతి తెల్సిందే .మురళి సొంత గ్రామం అయిన దౌలాపూర్ కి వెళ్ళిన మంత్రి హరీష్ రావు మురళి కుటుంబాన్ని పరామర్శించారు .ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు చదువుకుంటూ చేతికి అందవచ్చిన కుమారుడు చనిపోయాడు అంటేనే నాకే చాలా బాధగా ఉంది .జీవితంలో స్థిరపడి కుటుంబానికి అండగా ఉంటాడు అని అనుకుంటున్న సమయంలో తను మరణించడం కుటుంబానికి తీరని లోటు .
నాకే కన్నీళ్లు వస్తున్నాయి .అమ్మా నేను ఉన్నాను .నీకు ఏమి కాదు .అన్ని విధాలుగా అండగా ఉంటాను .మీకు గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రిలో నౌకరి ఇప్పిస్తాను .ప్రభుత్వం తరపున పది లక్షల రూపాయలను ఆర్ధిక సహాయం అందిస్తున్నాను .వాటితో అప్పులు ఉంటె తీర్చుకొని ..మిగతావి భద్రపరుచుకో ..నీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చిన ఈ హరీష్ ఉన్నాడు అనే సంగతి మరిచిపోవద్దు అని మురళి అమ్మ గారికి భరోసా కల్పించారు మంత్రి ..