ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రముఖ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని అందరికి తెల్సిందే .ఇదే విషయాన్నీ గురించి ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పలుమార్లు మీడియా సాక్షిగా ,తమ పార్టీ నేతల మీటింగ్స్ లో ఒప్పుకున్నారు కూడా .
ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒంగోల్ జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెల్సిందే .ఈ పర్యటనలో భాగంగా పవన్ మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయే పార్టీలు అయిన తెలుగుదేశం ,భారతీయ జనతా పార్టీలు అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం నేను .వాళ్ళు దగ్గరకు వచ్చి అడిగితె రాష్ట్ర భవిష్యత్తుకోసం వాళ్ళకు మద్దతు ఇచ్చాను అని ఆయన్ తెలిపారు .పవన్ చేసిన వ్యాఖ్యలపై అప్పుడే టీడీపీ శ్రేనుల నుండి విమర్శల పర్వం మొదలైంది .
అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో తన అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీను స్థాపించాడు .తర్వాత జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రస్తుతం తమ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం అని చెప్పుకుంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అప్పట్లో యువరాజ్యం అధినేతగా ఉండి కూడా అన్నను ఎందుకు గెలిపించలేకపోయాడు .అన్నను గెలిపించలేని పవన్ మమ్మల్ని గెలిపించాడా ..కేవలం తమపై ప్రజలకున్న నమ్మకమే గెలిపించింది .చంద్రబాబును చూసే ఓట్లు వేశారు అని ఆయన అన్నారు అని మీడియాలో వార్తలు వస్తున్నాయి .