రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలేసి మరీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన స్వప్రయోజనాలే లక్ష్యంగా నాడు హడావుడిగా అమరావతి నిర్మాణాన్ని మొదలు పెట్టారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. కాగా.. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాజధానిలో పది సంవత్సరాలు ఉండొచ్చు కదా..?, అయినా హైదరాబాద్ నుంచి అమరావతికి హుటాహుటిని ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది అంటూ చంద్రబాబు నాయుడుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఎవరైనా శంకుస్థాన రోజునే కాపురం మార్చేస్తారా..? అంటూ చంద్రబాబును ఎద్దేవ చేశారు. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు.
కేంద ప్రభుత్వంలో చంద్రబాబు పార్టీ ఉన్నప్పటికీ కూడా అక్కడ పట్టులేదన్నారు. ఈ విషయంపై నాకు ఆనాడే అనుమానం వచ్చిందన్నారు. ఆనాడు మోడీని హైదరాబాద్ వస్తే అరెస్టు చేస్తానన్న చంద్రబాబు. హైదరాబాద్‌కు వస్తే అరెస్టు చేస్తానన్న మాట ఆ నాడు దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా అనే ధైర్యం చేయలేదు. అలాంటి సమయంలో చంద్రబాబు ఒక్కడే మోడీని అరెస్టు చేస్తానంటూ హెచ్చరించాడని గుర్తు చేశారు ఉండవల్లి అరుణ్‌కుమార్. మోడీకి పెళ్లాం లేదు. పిల్లలు లేరు. తల్లి లేదు, తండ్రి లేదు ఓన్లీ రాజకీయం, అధికారమే మోడీ లక్ష్యం. ఆ నాడు చంద్రబాబు హెచ్చరికలే.. నేడు మోడీని చూసి చంద్రబాబు భయపడేలా చేస్తున్నాయంటూ చెప్పుకొచ్చారు ఉండవల్లి అరుణ్‌కుమార్. మోడీని రాజకీయంగా దెబ్బతీయడానికి అతనిపై కరెప్షన్లు, ఛార్జెస్ లేవు.. కానీ చంద్రబాబుకేమో ఒళ్లంతా కరెప్షన్లే కదా..! అందుకే మోడీని చూసి చంద్రబాబు భయపడుతున్నాడంటూ ఎద్దేవ చేశారు ఉండవల్లి అరుణ్‌కుమార్.