ఏపీలో ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మీద పలు విమర్శలు వస్తున్న సంగతి తెల్సిందే .ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు తీరు వలన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అవుతుంది అని ప్రధాన ప్రతిపక్ష వైసీపీ పార్టీ నుండి సీపీఎం వరకు అందరు విమర్శిస్తున్నారు .తాజాగా ఏపీ సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టులో టీడీపీ నేతలు చేస్తున్న పలు అవినీతి అక్రమాల వలన నిర్మాణం ఆలస్యమవుతుంది అని ఆయన ఆరోపించారు .బాబు వలన పోలవరం ఆలస్యం అవుతుంది అని ఆయన ఆరోపించారు .
