కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ సర్కారు రధసారథి ,ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఆ పార్టీకి చెందిన ఎంపీ బిగ్ షాకిచ్చారు .ఈ రోజు శనివారం ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో తొలిదశ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ఎంపీ తన పదవికి రాజీనామా చేశారు .మహారాష్ట్రంలో గొండియా లోక్ సభ సభ్యుడు నానా పటోల్ తన పదవికి రాజీనామా చేశారు .అయితే గత నాలుగు ఏండ్లుగా ప్రధాని మోదీ తీసుకుంటున్న నిర్ణయాలు ..చేస్తున్న పాలన నచ్చక ఈ నిర్ణయం తీసుకుంటున్నాను లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు పంపిన రాజీనామా లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు .