అవును మీరు చదివింది నిజమే. నిజంగానే రిలయన్స్ ఇండస్ర్టీస్ అధిపతి అనీల్ అంబానీ కొడుకు ఆకాష్ అంబానీ మళ్లీ సంచలనం సృష్టించాడు. అదేంటి ఆకాష్ అంబానీ మళ్లీ సంచలనం సృష్టించడమేంటని అనుకుంటున్నారా..? అక్కడికే వస్తున్నా..! ఈ మధ్యనేగా 108 కిలోల బరువు తగ్గి అందరికీ షాకిస్తూ సంచలనం సృష్టించిన ఆకాష్ అంబానీ.. బరువు తగ్గడంతోనే కాదు.. పెళ్లి వార్తలతోనూ సంచలనం సృష్టించొచ్చు అంటూ మళ్లీ నిరూపించాడు.
అవునండీ.. ఆకాష్ అంబానీ పెళ్లి వార్తలతో మళ్లీ మీడియాకు టాపిక్ అయ్యాడు. అయితే, ఆకాష్ పెళ్లి ఎప్పుడనేది అధికారికంగా ధృవీకరణ కాకపోయినప్పటికీ, పెళ్లి కార్డు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇందుకు కారణం పెళ్లి కార్డు ధరనే. ఇంతకీ ఆ పెళ్లికార్డు ధర ఎంతో తెలుసా..? అక్షరాల లక్షన్నరట. ఈ పెళ్లి కార్డు ధరతో ఐఫోన్ ఎక్స్ ను కొనేయవచ్చట. అందులోనూ ఈ పెళ్లి కార్డు ఎక్కువ భాగం బంగారంతోనే ఉండనుందట. ఇప్పుడు ఈ వార్తే నెటిజన్ల చర్చగా మారింది. కాగా, ఆకాష్ అంబానీ పెళ్లి ఈ నెలాఖరులో జరగనుందని సమాచారం.