వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రతో జనంలోకి దూసుకుపోతున్నారు. ఇక తాజాగా సాక్షీలో ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆశక్తికర విషయాలు చెప్పారు. ఏపీలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిలమ్మలు వచ్చే ఎన్నికలలో పోటీచేస్తారా అని ప్రశ్నించగా… జగన్ ఆశక్తికర సమాధానం చెప్పారు.
తమ కుటుంబంలో ఉన్న బందం చాలా బలమైనదని ఆయన అన్నారు. అమ్మ, షర్మిల ఇద్దరూ నా కోసం ఏమైనా చేస్తారు. వాళ్లేమీ రాజకీయాల్లో ఉండాలని అనుకోలేదని… ఆరోజు నన్ను అన్యాయంగా జైల్లో పెట్టి పార్టీయే లేకుండా చేయాలని చూశారు. మూడు నెలల్లో కచ్చితంగా చట్ట ప్రకారం బెయిల్ రావాల్సి ఉన్నా రానీయకుండా చేశారు. ఆరు నెలల పాటు మనిషే లేకుండాపోతే పార్టీయే లేకుండా పోతుందనే దుర్బుద్ధితో వీళ్లు చేసిన కుట్రల్లో నుంచి వారిద్దరూ బయటకు వచ్చారు. నాకు తోడుగా నిలబడ్డారు. పదవీ వ్యామోహం అమ్మకు.. పాపకు.. నా భార్యకు అస్సలు లేదు. ఎవరూ అలాంటి భావనతో ఉండరు. రిలేషన్షిప్స్ కూడా మా ఇంట్లో చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందని.. మా ఇంటి ఆడవాళ్లలో చాలా బలమైన బంధం ఉందని జగన్ చెప్పారు.