యమున ఒకప్పుడు తన అందంతో ,అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసిన టాప్ హీరోయిన్ .ఒకపక్క గ్లామర్ రోల్స్ పోషిస్తూనే ..మరోవైపు తనకే సాధ్యమైన అభినయంతో అందర్నీ ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ .అయితే గత కొంతకాలంగా యమున సిల్వర్ తెరకు దూరంగా ఉంటున్న సంగతి తెల్సిందే .
తాజాగా ఒక ప్రముఖ వెబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు .ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది .సదరు ఇంటర్వ్యూ లో అమ్మడు మాట్లాడుతూ “నేను ఒకసారి న్యూ ఇయర్ విషెస్ చెబుదామని మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళాను .
అయితే నేను వెళ్లేసరికి పవన్ కళ్యాణ్ ఇంట్లో ఉన్నారు .చిరంజీవి లేరు .కానీ ఇంట్లో పవన్ కళ్యాణ్ ఎదురొచ్చి మరి అన్నయ్య లేరు .గుడికి వెళ్లారు .కాసేపట్లో వస్తారు .అక్కడ కూర్చోండి అని చాలా వినయంగా మర్యాదగా చెప్పారు అని ఆమె అప్పట్లో జరిగిన ఉదంతాన్ని తెలియజేసింది .అయితే అప్పటికి పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రాలేదని ఆమె తెలిపారు ..